ఒకే కుటుంబం నుంచి ముగ్గురు | - | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు

Aug 23 2026 1:34 AM | Updated on Aug 23 2026 1:34 AM

ఒకే కుటుంబం నుంచి ముగ్గురు

సిరిసిల్ల: భారత తొలి ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తన తొలి కక్ష్య రాకెట్‌ ‘విక్రమ్‌–1’ను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి విజ యవంతంగా ప్రయోగించింది. ఆ సక్సెస్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్ల భాగస్వామ్యం ఉంది. సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌కు చెందిన అడుప కిరణ్‌ మెకానికల్‌ డిప్లొమా చేసి డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనేజేషన్‌(డీఆర్‌డీవో)లో చేరారు. శ్రీహరికోటలో ఐదేళ్లుగా రాకెట్‌ క్యాడ్‌ డిజైనర్‌గా రాకెట్‌ రూపకల్పనకు సంబంధించిన డిజైన్‌ పనుల్లో కీలక పాత్ర పోషించాడు. పోస్టాఫీస్‌ వీధికి చెందిన అడుప సంతోష్‌ బీటెక్‌ పూర్తి చేసి డీఆర్‌డీఏలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా చేరాడు. రాకెట్‌ అవియానిక్స్‌ గ్రౌండ్‌ చెక్‌ అవుట్‌ ఇంటిగరేషన్‌ విభాగాన్ని పర్యవేక్షించాడు. బొమ్మదేని నాగరాజు బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసి అంతరిక్ష ప్రయోగంలో ఎలక్ట్రికల్‌ ఇంటిగ్రేషన్‌లో రాకెట్‌ విద్యుత్‌ వ్యవస్థ సమీకరణ పనులను పర్యవేక్షించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement