సిరిసిల్ల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)లో సైంటిస్టుగా సిరిసిల్ల యువకుడు రాణిస్తున్నారు. సిరిసిల్లకు చెందిన మంచికట్ల సుశాంత్‌వర్మ(24) కేరళ రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం)లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్‌ఎస్‌సీ)లో సైంటిస్టుగా 2023లో ఉద్యోగం సాధించాడు. సుశాంత్ వర్మ తండ్రి రాజేశం మెప్మా కో–ఆర్డినేటర్ కాగా.. తల్లి సుధారాణి తంగళ్లపల్లి మండలం తాడూరు స్కూల్ ప్రభు త్వ ఉపాధ్యాయురాలు. సుశాంత్ వర్మ ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ స్పెస్ టెక్నాలజీ (తిరువనంతపురం)లో బీటెక్ పూర్తి చేశారు. ఇస్రోలో సైంటిస్టుగా ఉద్యోగం సాధించాడు. త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్‌ఎస్‌సీ) రూపొందించిన గగన్‌యాన్ అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామిగా ఉన్నాడు.


