కోరుట్లటౌన్: కోరుట్లకు చెందిన వడ్లకొండ వాసుదేవమూర్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాంతో కలిసి డీఆర్‌డీవోలో సైంటిస్టుగా పనిచేశారు. స్థానిక కాల్వగడ్డ జెడ్పీ పాఠశాలలో 1960లో పదోతరగతి పూర్తి చేశారు. డిగ్రీ తరువాత హైదరాబాద్‌లోని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)లో దేశ రక్షణకు సంబంధించిన సాటిలైటింగ్ వ్యవస్థ విభాగంలో సేవలందించారు. కొంతకాలం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశారు. ఉత్తమ సేవలకు మాజీ ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉన్నారు.


