ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో గంపెడాశలు నింపాయి. ఎండిపోతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారగా, మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలను ఎత్తిపోతలతో నింపుతున్నారు. ఎల్లంపల్లి నంది పంప్‌హౌజ్ నుంచి రోజూ 4 మోటార్లతో 12,600 క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్‌లోకి నీరు ఎత్తిపోస్తున్నారు. ఇక్కడి నుంచి ఎగువ, దిగువ మానేరుతో పాటు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు తాగు, సాగు నీటికి కాస్త ఉపశమనం కలిగిందంటున్నారు సంబంధిత అధికారులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


