కరీంనగర్ అర్బన్: నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తవగా పరిసర అభివృద్ధి, హెలిప్యాడ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈనెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్ ఇప్పటికే సీఎంతో ఈ విషయమై చర్చించినట్లు సమాచారం. అన్నీ అనుకూలంగా జరిగితే 16న కలెక్టరేట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
కార్యాలయాల తరలింపునకు కసరత్తు
ప్రస్తుత కలెక్టరేట్‌లో ఉన్న కార్యాలయాలను తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ చిత్రామిశ్రా సామగ్రి, ఫైళ్లు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తొలుత కలెక్టర్ చాంబర్, సిబ్బంది కార్యాలయాలను తరలించనుండగా తదుపరి అదనపు కలెక్టర్(స్థానికసంస్థలు), అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీఆర్వో కార్యాలయాలను తరలించనున్నారు. తదుపరి అన్ని కార్యాలయాలు కొత్త భవనం నుంచి సేవలందించనున్నాయి.
ఎక్కడెక్కడ యేయే కార్యాల యాలంటే..
నూతన కలెక్టరేట్‌లో తాజా లేఔట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో, రెవెన్యూ ప్రధాన విభాగం, డీడబ్ల్యూవో, ఎలక్షన్ విభాగం, పోస్టల్, ఎన్‌ఐసీ, ఇన్‌వార్డు, ఔట్‌వార్డు, వీడియో కా న్ఫరెన్స్ చాంబర్, మీటింగ్ హాల్ ఉండనున్నా యి. ఫస్ట్‌ఫ్లోర్‌లో డీఆర్డీవో, డీపీవో, జిల్లా వ్యవసాయశాఖ, ఆత్మ, సీపీవో, ఉద్యాన పట్టుపరిశ్రమశాఖ, మెప్మా, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ శాఖలు, ఆడిట్ శాఖలు ఉండనున్నాయి. సెకండ్ ఫ్లోర్‌లో డీఎస్వో, డీఎం సివిల్ సప్లయ్, ట్రైబల్ వెల్ఫేర్, విద్యాశాఖ, మైన్స్, సర్వే లాండ్ రికార్డ్స్, ఎస్డీసీ, హౌజింగ్, మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయాలు, విభాగాలు ఉండనున్నా యి. జిల్లా పశుసంవర్ధకశాఖ, పశువైద్యాల యం, ట్రైనింగ్ సెంటర్, డీఎంహెచ్‌వో, ఫుడ్‌సేఫ్టీ కంట్రో ల్, నీటిపారుదలశాఖల కార్యాలయాలు ప్రస్తుం ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగనున్నాయి.
పలు విభాగాలు పాత కలెక్టరేట్‌లోనే
ప్రస్తుత కలెక్టరేట్‌లోనే పలు కార్యాలయాలు కొనసాగనున్నాయి. ట్రెజరీశాఖ అక్కడే ఉండనుంది. భద్రత ప్రమాణాల ప్రకారం అదే సురక్షిత ప్రాంతం కావడంతో అక్కడే ఉండనుంది. అలాగే ఎస్‌బీఐ బ్యాంక్, లీడ్ బ్యాంక్ కార్యాలయాల అవే స్థలాల్లో ఉండనున్నాయి.


