కరీంనగర్ కార్పొరేషన్: ప్రజాపాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గురువారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినప్పటికి, రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల నెరవేర్చిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ధీటుగా బదులివ్వాలన్నారు.
లక్ష్యం.. గ్రీన్‌సిటీ
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలో వనమహోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో 3,50,000 మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుర్తించిన స్థలాల్లో మియవాకీ, బ్లాక్, ఎవెన్యూ ప్లాంటేషన్ పద్ధతుల్లో పండ్లు, పూలు, ఔషధ మొక్కలు నాటి, ప్రతి మొక్క వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి డిజిటల్ ట్రాకింగ్ ద్వారా సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ల వారీగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలన్నారు. నగరవ్యాప్తంగా ఖాళీ స్థలాలు, రోడ్డు డివైడర్లు, ప్రభుత్వ ప్రాంగణాల్లో మొక్కలు నా టాలన్నారు. అదనపు కమిషనర్ అయాజ్, డీఈ వెంకటేశ్వర్లు, హరితహారం ఇన్‌చార్జి స్వా మి, పర్యావరణ ఇంజినీర్ రమేశ్ పాల్గొన్నారు.
కృత్రిమ మేధస్సు ప్రత్యామ్నాయం కాదు
కరీంనగర్ టౌన్: కృత్రిమ మేధస్సు ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదని, వారి బోధనను మరింత సమర్థవంతంగా మలిచే శక్తివంతమైన సాధనమని డీఈవో చైతన్య జైనీ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆంగ్ల భాషను సులభంగా, ఆసక్తికరంగా, అర్థమయ్యేలా బోధించాలనే లక్ష్యంతో 4వ తరగతి ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలోని మొత్తం 12 యూనిట్లకు ఏఐ ఆధారిత వీడియో పాఠాలుగా రూపొందించగా, ఆ సీడీని గురువారం ఆవిష్కరించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే ప్రతి తరగతి గది ఆనందదాయకమైన అభ్యాస కేంద్రంగా మారుతుందన్నారు. ఏఐ వీడియో పాఠాలు విద్యార్థులకు ఇంగ్లిష్ సులభంగా అర్థమయ్యేలా చేసి, భాషపై ఆసక్తి, అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కరీంనగర్ టౌన్: కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని, అదానీ, అంబానీల మాయలో ప్రధాని నరేంద్ర మోదీ పడ్డాడని సీపీఐ సీని యర్ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచారజాతను గురువారం నగరంలోని పద్మనగర్‌లో ప్రారంభించా రు. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రచార జాతా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, అందెస్వామి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


