కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర అభివృద్ధికి సహకారం అందించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్సిపల్‌పరిపాలనశాఖ ఉన్నతాధికారులను కలిసి కోరారు. గురువారం హైదరాబాద్‌లో జరగాల్సిన కరీంనగర్ నగరపాలకసంస్థ అభివృద్ధిపై రాష్ట్రమంత్రుల సమీక్ష ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో సీడీఎంఏ శ్రీదేవి, ఈఎన్‌సీ భాస్కర్‌రెడ్డి, డీటీసీపీ దేవేందర్‌ను కలిసిన మేయర్ నగరాభివృద్ధి, పాలనాపరమైన ప్రతిపాదనలు అందించారు. విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీడీఎంఏ శ్రీదేవిని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్, వీధి దీపాలు, పారిశుధ్య వసతులు కల్పించాలన్నారు. అమృత్ కింద యూజీడీకి కేటాయించిన రూ.70 కోట్లను తాగునీటి పైప్‌లైన్లు, ట్యాంక్‌ల నిర్మాణానికి మళ్లించాలన్నారు. తీగలగుట్టపల్లిలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని, ఆర్‌అండ్‌బీ రోడ్లకు ప్యాచ్‌వర్క్, అప్రోచ్ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాలన్నారు.
టౌన్‌ప్లానింగ్‌ను బలోపేతం చేయాలి
టౌన్‌ప్లానింగ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, బలోపేతం చేయాలంటూ డీటీసీపీ దేవేందర్‌ను కలిసి మేయర్ వినతిపత్రం అందించారు. ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ ఈఎన్‌సీ భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
ఒకటి, రెండు రోజుల్లో మంత్రుల సమీక్ష
నగర అభివృద్ధిపై జిల్లా ఇన్‌చార్జి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడింది. గురువారం హైదరాబాద్ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసినప్పటికి, మంత్రుల బిజీ షెడ్యూల్‌తో వాయిదా పడినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


