ఠాణా మెట్లెక్కని ఎగ్లాస్‌పూర్‌ | - | Sakshi
Sakshi News home page

ఠాణా మెట్లెక్కని ఎగ్లాస్‌పూర్‌

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

● ప్రశాంతతకు నిలయం

● సామరస్యానికి నిదర్శనం

● ఐక్యతకు ఆదర్శం

కోనరావుపేట(వేములవాడ): చుట్టూ ఎత్తయిన గుట్టలు.. గ్రామంలోకి స్వాగతం పలికే చెట్లు.. ఆకుపచ్చని పొలాలు మ ధ్యలో అందంగా కనిపించే ఇళ్లతో ఎగ్లాస్‌పూర్‌ ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఆ పల్లె ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. గ్రామస్తులు సామరస్యంగా ఉంటూ సమస్యలను ఊరిలోనే పరిష్కరించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోలీస్‌స్టేషన్‌ గడప ఈ గ్రామస్తులు తొక్కలేదు.

శాంతియుత జీవనం

రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామస్తులు శాంతియుత జీవనాన్ని పాటిస్తున్నారు. 750 మంది జనాభా ఉన్న గ్రామంలో ఇంటిపన్ను, నల్లాబిల్లు చెల్లించడంతో పాటు వివాదరహితంగా పేరుగాంచింది. గ్రామంలో తలెత్తే సమస్యలను గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నారు. కుటుంబ కలహాలు, వ్యవసాయ భూముల సరిహద్దు సమస్యలు, ఇతర చిన్న తగాదాలు తలెత్తినప్పుడు సంబంధిత కుటుంబాలను ఒకే చోట కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కారం చూపుతారు. పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా సామరస్యపూర్వకంగా రాజీ కుదుర్చుతారు.

అన్నింటిలోనూ ఆదర్శం

గ్రామస్తులు ఐకమత్యంతో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. పారిశుధ్యం, పచ్చదనం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ప్రతీ విషయంలో గ్రామ ప్రయోజనాలనే ముందుంచే సంస్కృతి ఎగ్లాస్‌పూర్‌ ప్రత్యేకత. ఉపాధిహామీలో ప్రతి ఒక్కరు వంద రోజుల పనిదినాలను పూర్తిచేసుకుంటారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటారు.

గ్రామ స్వరూపం

జనాభా 750

ఓటర్లు 490

గృహాలు 190

జాబ్‌కార్డులు 230

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement