అక్రమాలకు సెలవు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు సెలవు

Jul 13 2026 5:54 AM | Updated on Jul 13 2026 5:54 AM

లీవ్‌లపై ఈ– నిఘా ప్రతీ ఉద్యోగికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పూర్తయిన సర్వీస్‌ బుక్‌ల డిజిటలైజేషన్‌ సెలవు తీసుకోవాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందే

కరీంనగర్‌టౌన్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సెలవుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్‌ రికార్డుల (ఎస్‌ఆర్‌) డిజిటలైజేషన్‌ పూర్తికావడంతో ఇకపై అన్నిరకాల సెలవులకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ ఉద్యోగికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయించి వ్యక్తిగత సేవా వివరాలను డిజిటల్‌ విధానంలో నిర్వహించనుంది. ఇప్పటివరకు కొన్ని చోట్ల సెలవు పెట్టినా.. హాజరు నమోదైనట్లు చూపించడం, సర్వీస్‌ రికార్డుల్లో మార్పులు చేయడం వంటి అక్రమాలకు అవకాశం ఉండేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త విధానంతో అలాంటి వాటికి పూర్తిగా అడ్డుకట్ట పడనుంది.

పూర్తయిన ఆన్‌లైన్‌ ప్రక్రియ

ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీసు రికార్డు బుక్‌ నిర్వహణలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం డిజిటలైజేషన్‌ ప్రక్రియను తెరమీ దికు తెచ్చింది. డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ (డీడీవో) సమక్షంలో ప్రతీ ఉద్యోగి తన సర్వీస్‌ రికార్డుల్లోని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే గడువు జూన్‌ 8 కావడంతో సదరు ప్రక్రియ పూర్తయింది.

అక్రమాలకు చెక్‌

ప్రస్తుత విధానంలో ఉద్యోగుల సర్వీసు రికార్డులను డీడీవోలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. ప్రతీ ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి విరమణ అయ్యే వరకు ఆయన సెలవులు, ఇంక్రిమెంట్లు, ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఆర్జిత సెలవులు, రిమార్కులు వంటివి సర్వీస్‌ రికార్డు ద్వారా తెలుస్తాయి. కాగా, మామూళ్ల మత్తులో కొందరు డీడీవోలు ట్రెజరీ అధికారులతో కుమ్మకై ్క సెలవులు వాడుకున్నా వాడలేదని వివరాలు నమోదుచేస్తూ ప్రభు త్వ ఖజానాకు కన్నం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శిశు సంరక్షణ సెలవుల విషయంలోనూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని, విదేశాలకు వెళ్లినా, దీర్ఘకాలిక సెలవులో ఉన్నా బినామీలను పెట్టి నెలవారి వేతనాలు డ్రా చేసుకున్న ఘట నలూ గతంలో చోటు చేసుకున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వం సర్వీసు బుక్‌ను ఆన్‌లైన్‌ ఉంచాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ డిజిటలైజేషన్‌ ప్రక్రియ వల్ల భవిష్యత్తులో ఈ–పెన్షన్‌, పేరోల్‌ ప్రాసెసింగ్‌ వంటి సేవలు సులభంగా, మరింత వేగవంతంగా అందనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement