నులి పురుగులను నలిపేద్దాం | - | Sakshi
Sakshi News home page

నులి పురుగులను నలిపేద్దాం

Jul 13 2026 5:54 AM | Updated on Jul 13 2026 5:54 AM

● నేటి నుంచి నులిపురుగుల నివారణ కార్యక్రమం ● 1–19 ఏళ్ల వారందరికీ అల్బెండజోల్‌ మాత్రలు ● 1–2 ఏళ్ల పిల్లలకు అర మాత్ర (200 ఎంజీ) పొడి రూపంలో ● 2–3 ఏళ్ల వారికి ఒక మాత్ర (400 ఎంజీ) పొడి రూపంలో ● 3–19 ఏళ్ల వారు ఒక మాత్ర (400 ఎంజీ) చప్పరించాలి ● ప్రతీ ఆర్నెళ్లకోసారి మాత్ర వేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు

కరీంనగర్‌: కడుపులో నులిపురుగుల కారణంగా పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో అలసిపోతారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. శారీరక మానసిక అభివృద్ధి మందకొడిగా ఉంటుంది. నులిపురుగులను నిర్మూలించడానికి డ బ్ల్యూహెచ్‌వో, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా రెండు విడతల్లో జాతీ య నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 13న సో మవారం నుంచి ఆల్బెండజోల్‌ మాత్రలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్వాడీ కేంద్రాలతోపాటు బడి బయట ఉండే పిల్లలకు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు వే యించనున్నారు. జిల్లాలో 2,59,365 మంది 1 నుంచి 19 లోపు పిల్లలు ఉన్నారు. 924 పాఠశాలలు, 66 జూనియర్‌ కాలేజీలు, 777 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా 632 మంది ఆశాలు, 777 మంది అంగన్వాడీ టీచర్లు, 990 మంది పాఠశాల, కళాశాలల ప్రతినిధులు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీలో పాల్గొంటారు.

మాత్రలు ఇలా ఇవ్వాలి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరైనా కొన్ని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సూచన మేరకే వేయాలి. జ్వరం, దగ్గు, ఇతర జబ్బులతో ఉన్నా, ఏవైనా ఇతర మందులు వాడుతున్న పిల్లలకు ఈ మాత్ర ఇవ్వడంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు మాత్రను ఒక గ్లాసు నీటితోపాటు నమిలి మింగాలి. తప్పనిసరిగా ఆరోగ్య కార్యకర్త సమక్షంలో వారి మార్గదర్శనంలోనే ఈ మాత్రను వినియోగించాలి.

సంక్రమణ విధానమిదీ..

కడుపులో నులి పురుగులున్న పిల్లల మలంతో నులి పురుగుల గుడ్లు నేలను కలుషితం చేస్తాయి. ఈ గుడ్లు నేలలో లార్వాగా వృద్ధి చెందుతాయి. ఇతర పిల్లలు ఆహారం ద్వారా, మురికి చేతుల ద్వారా లార్వా చర్మంలోకి పోవడంతో నులిపురుగుల సంక్రమణ జరుగుతుంది. దీంతో గుడ్లు, లార్వాలు క్రిములుగా వృద్ధి చెంది తిరిగి గుడ్లను ఉత్పత్తి చేసి పిల్ల లకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి.

పిల్లలందరికీ మాత్రలు వేయాలి

1–19 ఏళ్లు ఉన్న పిల్లలకు ఆ ల్బెండజోల్‌ మాత్రలు వయస్సును బట్టి సూచించిన డోస్‌ ప్రకారం వేయాలి. అన్ని స్కూ ళ్లు, కళాశాలల్లో పిల్లలకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వేయాలి. బడిబయటి పిల్లలను గుర్తించి వారికి కూడా మాత్రలు వేస్తాం.

– డాక్టర్‌ శ్రీరామ్‌, డీఎంహెచ్‌వో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement