వైభవం.. మల్లన్న పెద్దపట్నం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. మల్లన్న పెద్దపట్నం

Jul 13 2026 5:54 AM | Updated on Jul 13 2026 5:54 AM

ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి పెద్దపట్నం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో సదయ్య, చైర్మన్‌ చీకట్ల మొండయ్య, ప్రధాన అర్చకుడు దూపం వీరభద్రయ్య ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులు చేశారు. సుమారు 100 మంది ఒగ్గు పూజారులు పసుపు, కుంకుమలతో మూడు గంటలపాటు పెద్దపట్నాలు వేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, ట్రాన్స్‌కో ఏడీఏ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement