పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి

Jul 13 2026 5:54 AM | Updated on Jul 13 2026 5:54 AM

కరీంనగర్‌టౌన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌ డీఏలు విడుదల చేసి తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కృషి భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షతన జరిగిన 16వ వార్షిక కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందినవారికి పీఆర్సీ బకాయిలు, గ్రాట్యుటీ తదితర బిల్లులు ఒకేసారి చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్మోహన్‌, వెద్యుల రాజిరెడ్డి, బి.శ్యాం, కె.నారాయణరెడ్డి, ఎం.రఘుశంకర్‌రెడ్డి, కె.చంద్రమౌళి, హుమేరా జబీన్‌, టి.తిరుపతిగౌడ్‌, ఎ.శ్రీనివాస్‌, ఆర్‌.శంకరయ్య, బి.రమేశ్‌, ఎస్‌.చక్రధర్‌, యు.శంకర్‌, ఎస్‌.సంపతి, ఎస్‌.అంజయ్య, కె.కిషన్‌రెడ్డి, తూముల తిరుపతి, ఎం.సదానందం, సీహెచ్‌.దేవేందర్‌, వి.రాంకిరణ్‌, పి.అరుణాదేవి, కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

‘నేను సైతం’ పుస్తకం ఆవిష్కరణ

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌లోని గణాంకభవన్‌లో ఆదివారం భవానీ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో కవి వైరాగ్యం ప్రభాకర్‌ సంపాదకత్వంలో వెలువడిన నేను సైతం పుస్తకాన్ని రిటైర్డ్‌ ఆర్డీవో మహేశ్వర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రావు మాట్లాడుతూ సమాజంలోని విభిన్న వర్గాల జీవన వాస్తవాలు, సామాజిక సమస్యలు, మానవీయ విలువలను ప్రతిబింబించే రచనలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సాహిత్య కార్యక్రమాలను ఆన్‌లైన్‌ వేదికగా కొనసాగించి రచయితలను ప్రోత్సహించిన వైరాగ్యం ప్రభాకర్‌ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్‌, బొమ్మకంటి కిషన్‌ దామరకుంట శంకరయ్య, పెద్దిరాజు సత్యనారాయణరాజు, ఎస్‌.సంపత్‌కుమార్‌, ఎర్రోజు వెంకటేశ్వర్లు, యుగంధర్‌ జనగాని, రాపర్తి వెంకటేశ్వర్లు, గుండు రమణయ్య పాల్గొన్నారు.

డయల్‌ 100కు తక్షణ స్పందన

కరీంనగర్‌క్రైం: కుటుంబ తగాదాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కరీంనగర్‌ టూటౌన్‌ బ్లూకోల్ట్స్‌ సిబ్బంది సకాలంలో స్పందించి కాపాడారు. విద్యానగర్‌కు చెందిన సంపత్‌ ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లినట్లు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో డయల్‌ 100కు సమాచారం అందింది. టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సృజన్‌రెడ్డి ఆదేశాలతో బ్లూకోల్ట్స్‌ సిబ్బంది విష్ణు, రాకేశ్‌ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అతడిని గుర్తించి ప్రాణాలు కాపాడారు. అనంతరం ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన సిబ్బందిని ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement