● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని ఈ నెల 16న మహాలక్ష్మీ ఆలయం నుంచి వైశ్యభవన్ వరకు నిర్వహించే జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం రథయాత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. ఏటా వేలాది మంది భక్తుల భాగస్వామ్యంతో రథోత్సవం వైభవంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కరీంనగర్– సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఇస్కాన్ రాధా–గోవింద మందిర నిర్మాణానికి కేటాయించిన మూడెకరాల్లో ఆలయ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అ నంతరం ఇస్కాన్ మందిరంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకున్నారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, హరిశంకర్, గుగ్గిళ్ల జయశ్రీ, గు గ్గిళ్ల శ్రీనివాస్, డాక్టర్ ఎల్.రాజభాస్కర్‌రెడ్డి, తు మ్మల రమేశ్‌రెడ్డి, కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి, రాళ్లబండి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఓటరు నమోదుకు హెల్ప్‌డెస్క్
కరీంనగర్‌టౌన్: నగరంలోని కిసాన్‌నగర్, చింతకుంటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓట రు నమోదు, ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) స హాయ కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే వీటి ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభు త్వ యంత్రాంగం, బీఎల్‌వోల సమన్వయ లోపం వల్ల నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మా త్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలి పారు. ఈనెల 24 లోపు మిగిలిన ప్రక్రియను ము గించాల్సి ఉందని, ఆన్‌లైన్ సర్వర్లు సరిగ్గా పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే బీఆర్‌ఎస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తోందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకో వాలని కోరారు. కార్పొరేటర్ గడ్డి ప్రదీప్‌కుమార్ నాయకులు పాల్గొన్నారు.


