ఉపాధి.. అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఉపాధి.. అవగాహన

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

ఉపాధి.. అవగాహన

కుట్టుమిషన్‌, ఎంబ్రాయిడింగ్‌, మగ్గంవర్క్‌తో ఉపాధి పొందుతూ.. ప్లాస్టిక్‌ రహిత కాటన్‌, పేపర్‌ డిజైన్‌ బ్యాగ్‌లు తయారు చేసి 10మందికి ఉపాధి కల్పిస్తున్నారు జమ్మికుంట పరిధిలో ధర్మారానికి చెందిన కంది కట్ల పద్మ. పద్మ మహిళ సంఘం నాయకురాలిగా ఉన్నారు. మెప్మా చేయుతతో కుట్టు శిక్షణ తీసుకొని ఎంబ్రాయిడింగ్‌, మగ్గంవర్క్‌ చేస్తున్నారు. మిగిలిపోయిన కాటన్‌ బట్టతో ఉచితంగా హ్యాండ్‌బ్యాగ్‌లు తయారు చేసి ఇస్తున్నారు. వీటితో పాటు కాటన్‌, పేపర్‌ బ్యాగ్‌లు, వాటర్‌ బాటిల్‌ పట్టే సంచులు, ఇంట్లో అలంకరణగా పెట్టుకునేందుకు క్లాత్‌తో ప్రింటెడ్‌ ఫొటోప్రేమ్‌లు, శుభకార్యలకు గిప్ట్‌లు అందిస్తున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement