ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన

Jul 6 2026 7:00 AM | Updated on Jul 6 2026 7:00 AM

కరీంనగర్‌/కరీంనగర్‌కార్పొరేషన్‌: క్షేత్రస్థాయిలో బూత్‌ లెవెల్‌ అధికారులు (బీఎల్‌వో) చేపడుతున్న ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను ఆదివారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్‌ నగరపాలక డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేను పర్యవేక్షించిన ఆయన, బీఎల్వోలకు పలు కీలక సూచనలు చేశారు. బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి ఓటరుకు తప్పనిసరిగా ఫారాలు చేరేలా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లకు ఫారాలు ఇవ్వడమే కాకుండా, పూర్తిచేసిన ఫారాలను తిరిగి ప్రతి ఓటరు వద్ద నుంచి సేకరించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క ఓటరుకు కూడా ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ బాధ్యతలను నిర్వర్తించాలని అధికారులకు స్పష్టం చేశారు.

పీజీఎస్‌ఏఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): ప్రియాంకగాంధీ సంఘటన్‌ ఆల్‌ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రేకుర్తికి చెందిన మాజీ సర్పంచ్‌ నందెల్లి ప్రకాశ్‌ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు అరుమల్ల యమునరెడ్డి ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడంతోపాటు ప్రియాంకగాంధీ సంఘటన్‌ను రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు శాయశక్తులా పని చేస్తానని ప్రకాశ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement