తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ఆర్టీసీ బస్టాండే అతి పెద్దది. ఇక్కడి నుంచి నిత్యం వేలాది మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కై తే ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. రాత్రి 9.30 గంటల తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సులు లేకపోవడంతో బస్టాండ్‌లో జనం కిక్కిరిసిపోతున్నారు. కొందరైతే రాత్రంతా అక్కడే జాగారం చేస్తున్నారు. మరికొందరు కునుకు తీస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సులకు చార్జీ ఎక్కువగా ఉండడంతో ఇబ్బందిపడుతున్నారు. వేకువజామున 3 గంటల తర్వాత ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తాయని ఎంకై ్వరీ పాయింట్ సిబ్బంది చెబుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సులు రాత్రి 11.30, 12.45 గంటలకు, అంతకంటే ముందు మంథని డిపోకు చెందిన మియాపూర్ బస్సు రాత్రి 11.45 గంటలకు నడిచేవని అవి ఇప్పుడు కనిపించడంలేదని పేర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


