ఆస్తి కోసం అంత్యక్రియలు అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం అంత్యక్రియలు అడ్డగింత

Jun 9 2026 12:12 AM | Updated on Jun 9 2026 12:12 AM

జగిత్యాలక్రైం: ఆస్తి కోసం కన్నతండ్రికి అంత్యక్రియలు నిర్వహించకుండా కూతుళ్లు అడ్డుకున్న ఘటన జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుమాన్‌వాడకు చెందిన జంగిలి మల్లయ్యకు కుమారుడు మల్లేశంతోపాటు ఇద్దరు కూతుళ్లు సంతానం. మల్లేశం కరోనా సమయంలోనే చనిపోయాడు. అప్పటికే మల్లేశంకు భార్య సుజాత, కుమారుడు మనోజ్‌, కూతురు ఉన్నారు. అయినప్పటికీ మల్లయ్య ఆస్తిని కూతుళ్లిద్దరూ వారి పేరున రాయించుకున్నారు. ఈ నేపథ్యంలో మల్లయ్య (80) అనారో గ్యంతో సోమవారం మృతిచెందాడు. విషయం తెలు సుకున్న సుజాత, మనోజ్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లారు. అప్పటికే ఇంటికి చేరిన మల్లయ్య కూతుళ్లు, అల్లుళ్లు సుజాత, మనో జ్‌పై దాడికి పాల్పడ్డారు. మనోజ్‌తో అంత్యక్రియలు చేయిస్తే తాము రాయించుకున్న ఆస్తిని ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందోనని గొడవకు దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అంత్యక్రియలు మనోజ్‌తో జరిపించబోమ ని తేల్చిచెప్పారు. కులస్తులందరూ సముదాయించినా వినిపించుకోలేదు. దీంతో బాధితులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి మనోజ్‌తో మల్లయ్య అంత్యక్రియలు పూర్తి చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement