భక్తురాలి మంగళసూత్రం చోరీ | - | Sakshi
Sakshi News home page

భక్తురాలి మంగళసూత్రం చోరీ

Jun 9 2026 12:12 AM | Updated on Jun 9 2026 12:12 AM

ఇద్దరు దొంగలు అరెస్టు

వేములవాడ: భీమన్న దర్శనానికి వచ్చిన భక్తురాలి మెడలోంచి మంగళసూత్రం ఎత్తుకెళ్లిన దొంగలను వేములవాడటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వీరప్రసాద్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా న్యాల్కల్‌ గ్రామానికి చెందిన మాముళ్ల నవనీత కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడకు దర్శనానికి ఆదివారం వచ్చింది. దర్శనం అనంతరం ఎస్సారార్‌ పార్కింగ్‌ ప్రదేశంలో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో వేములవాడ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన అకమ్మ అశోక్‌(29), పంజా చందు(31)లను అరెస్టు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పార్క్‌ చేసిన బైక్‌ను దొంగలించి దానిపైనే వేములవాడకు వచ్చి మంగళసూత్రం లాక్కెళ్లారు. నిందితుల నుంచి సుమారు 20.120 గ్రాముల బంగారం, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతి తక్కువ సమయంలో దొంగలను పట్టుకున్న ఎస్సై రాంమోహన్‌, పీసీలు గోపాల్‌, పంతులు, బ్లూకోల్ట్స్‌ పీసీ సంపత్‌లను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement