ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

Mar 20 2026 7:58 AM | Updated on Mar 20 2026 7:58 AM

చొప్పదండి: ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్‌లో స్వశక్తి సంఘాల నూతన భవనాల నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలను గౌరవించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొత్తూరి మహేశ్‌, వడ్లూరి శ్రీనివాస్‌, పెరుమాండ్ల గంగయ్యగౌడ్‌, కర్రె ప్రేమలత, నిజానపురం చందు, పురం రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement