ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

Mar 20 2026 7:58 AM | Updated on Mar 20 2026 7:58 AM

కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన ఆటో డ్రైవర్‌ జెట్టి లచ్చయ్య(65) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. జెట్టి ల చ్చయ్య ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అ ప్పులు చేసి కొత్త ఆటో కొనుగోలు చేశాడు. గిరాకీలు సరిగా లేక ప్రతీ నెల వాయిదాలు చెల్లించేందుకు ఇబ్బందులు పడ్డాడు. దీనికితోడు అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో గురువారం తెల్లవారుజామున ఇంటి ఎదుట పందిరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కనకవ్వ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఉగాది పండుగ రోజున లచ్చయ్య ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాపీమేసీ్త్ర అదృశ్యం

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని బొమ్మెనలో తాపీమేసీ్త్ర పనిచేసుకుంటూ జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మన్యంపార్వతీపురం జిల్లా కురుపం గ్రామానికి చెందిన మండంగి మహేశ్‌(35) అదృశ్యమయ్యాడని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికిరణ్‌ గురువారం తెలిపారు. 11 రోజుల క్రితం బొమ్మెన నుంచి వెళ్లిన మహేశ్‌ తిరిగి రాకపోవడంతో బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో వాకబు చేశారు. ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యమైనట్లు ఆయన భార్య సుమతి గురువారం ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement