నారాయణపూర్‌కు ఎల్లంపల్లి నీరు
గంగాధర: యాసంగికి సాగునీరు అందించేందుకు మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఎల్లంపల్లి నీరు విడుదల చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రిజర్వాయర్ వద్దకు చేరుకొని పూజలు చేశారు. పంటలు ఎండిపోకుండా సాగునీరందించి కాపాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురమల్ల మనోహర్, సర్పంచులు వేముల భాస్కర్, ముద్దం నగేశ్, బాసవేణి శ్రీనివాస్, శశిధర్‌రెడ్డి, రేండ్ల శ్రీనివాస్, బారరాజు ప్రభాకర్‌రెడ్డి, బీర్ల ఆనందం, తిరుపతి పాల్గొన్నారు.
తిమ్మాపూర్: కరీంనగర్ కార్పొరేషన్ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించింది. 8వ డివిజన్ (అల్గునూరు) అభ్యర్థిగా గోపు మల్లారెడ్డి పేరు ఖరారైంది. ఎల్‌ఎండీకాలనీ ప్రజాభవన్ లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. అభ్యర్థి గెలుపుపై కార్యకర్తలు దృష్టి పెట్టాలని సూచించారు. అల్గునూరు బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ మెహరాజ్, ఎండీ ఆశ్రఫ్ అలీ, ఎండీ నవీద్, ఇమ్మజ్ అహ్మద్ కాంగ్రెస్‌లో చేరగా.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి ఆహ్వానించారు.
కొత్తపల్లి(కరీంనగర్): రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచారం రైతులకు అందించాలని ఫెర్టిలైజర్ డీలర్లకు జిల్లా వ్యవసాయాధికారి జె.భాగ్యలక్ష్మీ సూచించారు. కొత్తపల్లి(హెచ్) రైతు వేదికలో శనివారం డీఏఈఎస్‌ఐ శిక్షణ తరగతులను ఆత్మ పీడీ బి.చఽత్రునాయక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ఈ శిక్షణ కోర్సు వారంలో ఒకరోజు వివిధ పరిశోధన కేంద్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని డీలర్లకు అందించడం జరుగుతుందన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 11 కె.వీ.ఎల్లమ్మ ఫీడర్ పరిధిలోని డంప్‌యార్డు, తీగల వంతెన ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
నారాయణపూర్‌కు ఎల్లంపల్లి నీరు


