కరీంనగర్ అర్బన్: లైసెన్స్ లేకుండా ఐస్‌క్రీమ్ తయారు చేయొద్దని గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పి.రోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగఽళవారం అల్గునూరు వద్ద ఉన్న ఉత్తమ్ ఐస్‌క్రీమ్ తయారీకేంద్రాన్ని ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ వి.అంకిత్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఐస్‌క్రీమ్ ప్యాకేజింగ్‌లో తయారీ చిరునామా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ లైసెన్స్ నంబర్లు లేవని గుర్తించారు. తప్పుడు మార్గంలో లైసెన్స్ పొందారని తేలగా, రూ.6వేల విలువ గల స్టాక్ సీజ్ చేశారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని రోహిత్‌రెడ్డి సూచించారు.


