హుజూరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం | - | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Mar 11 2026 7:35 AM | Updated on Mar 11 2026 7:35 AM

● మంత్రి పొన్నం ప్రభాకర్‌ ● బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా రొంటాల సుహాసిని బాధ్యతలు స్వీకరించగా, కార్యక్రమానికి మంత్రి పొన్నం, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హుజూరాబాద్‌ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తారని అన్నారు. పట్టణ అభివృద్ధికి రూ.300 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చారని, ఎంపీ సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ప్రజా పాలన కార్యక్రమంలో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ అహ్మద్‌ సయ్యద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement