● స్క్రీన్‌షాట్స్‌తో డబ్బులు పంపామని బుకాయింపు
బ్యాంకుకు వచ్చి..
రోడ్డు ప్రమాదానికి గురై..
కోరుట్ల రూరల్: మండలంలోని గుంలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బుగ్గారపు వెంకటరాజం (77) అనే వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన వెంకటరాజం బ్యాంక్ పని నిమిత్తం శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై కోరుట్లకు వచ్చాడు. పని ముగించుకొని సాయంత్రం తిరిగి దమ్మన్నపేటకు వెళ్తుండగా గుంలాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జగిత్యాల వైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో వెంకటరాజం అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కారు అతివేగం అజాగ్రత్తగా నడపటంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి భార్య బుగ్గారపు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు.
రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు
ఎల్లారెడ్డిపేట: పొరపాటుగా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని.. తిరిగి తమకు పంపించాలని ఎల్లారెడ్డిపేట మండలంలోని పలువురికి సైబర్‌మోసగాళ్లు వాట్సాప్‌లో కాల్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు పంపించినట్లు స్క్రీన్‌షాట్స్ పంపి నమ్మించేందుకు యత్నించారు. డబ్బులు తమకు రాలేవని చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ..మళ్లీ స్క్రీన్‌షాట్స్ పంపుతూ డబ్బులు పంపాలని ఒత్తిడి తెచ్చినట్లు వారు చెప్పారు. అప్రమత్తమై బ్యాలెన్స్ చెక్ చేసుకొని డబ్బులు జమకాలేదని నిర్ధారించుకున్నట్లు వారు వివరించారు.


