హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కరీంనగర్‌రోడ్‌లో గల శాంసంగ్ షోరూం సమీపంలో డిసెంబర్ 31 సాయంత్రం జరిగిన కొలగాని అంజయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్య వద్ద చిట్టీ వేసి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న బాసోజి శ్రీనివాస్‌ను అంజయ్య చిట్టీ డబ్బులు అడిగినందుకు పథకం ప్రకారం శ్రీనివాస్, అతని కుమారుడు వేణుచారిలు కలిసి డిసెంబర్ 31న కరీంనగర్‌రోడ్‌లోని శాంసంగ్ షోరూం ప్లాజా వద్దకు అంజయ్యను పిలిపించి దాడి చేసినట్లు తెలిపారు. దీంతో అంజయ్యను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసి శుక్రవారం లింగంపేట శివారులో వారిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


