ఎన్గల్ శివారులో చిరుత సంచారం
● భయాందోళనలో రైతులు
చందుర్తి(వేములవాడ): మండలంలోని ఎన్గల్ శివారులోని లింబాద్రి ఒర్రె, శ్మశానవాటిక సమీపంంలో శుక్రవారం చిరుత పాదముద్రలను స్థానికులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వేములవాడరూరల్ మండలం హన్మాజీపేట శివారులోని రైస్‌మిల్లు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వేములవాడరూరల్, చందుర్తి మండలాల సరిహద్దు ఎన్గల్ గ్రామంలో ప్రవేశించిందని గురువారం నుంచే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం చిరుత పాదముద్రలను గుర్తించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.


