కల్వర్టుపై ఆధార్‌కార్డుల కుప్ప
చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి శివారులోని కల్వర్టుపై ఆధార్‌కార్డుల కుప్పలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 20కి పైగా ఆధార్‌కార్డులు కుప్పలుగా పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరైనా వ్యాపారులు యూరియా ఎరువుల బస్తాల కోసం తీసుకొని.. పని పూర్తికాగానే పడేసి ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైన దొంగలు ఎత్తుకొచ్చి పడేసి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన స్థలంలో సుద్దాల దేవరాజు, రామడుగు పోశవ్వ, రామిడి సంజీవ్, తుమ్మల రమ్య, కటకం దేవరాజు తదితర పేర్లు ఉన్న ఆధార్‌కార్డులు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపడితేనే ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తేలనుంది.


