ఉడాయిస్తున్న మేసీ్త్రలు !
ఇతను ఎకిలిపురం రవి. ఇంటి నిర్మాణం కోసం మేసీ్త్రతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సగం పనులు చేసిన మేసీ్త్ర తర్వాత ఉడాయించాడు. అయితే అప్పటికే చేసిన పని కంటే రూ.3లక్షలు అదనంగా వసూలు చేసుకున్నాడు. చేసేదేమి లేక మరో మేసీ్త్రతో మిగతా పనులు చేయించుకున్నాడు. దీంతో అదనంగా రూ.7లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఇతను రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దేశవేని పెద్దగంగారం. కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు ఓ మేసీ్త్ర వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. మేసీ్త్ర మొదట కొన్ని డబ్బులు తీసుకొని పనులు ప్రారంభించాడు. అంతలోనే మరో రూ.5లక్షలు వరకు మేసీ్త్ర వసూలు చేసుకున్నాడు. డబ్బులు ముట్టిన తర్వాత పనులు చేయకుండా ఉడాయించాడు. మేసీ్త్రకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మోసపోయనాని గ్రహించిన గంగారం మరో మేసీ్త్రకి మిగిలిన పనుల కాంట్రాక్ట్ ఇచ్చాడు. దీంతో అదనంగా రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుంది.
ఉడాయిస్తున్న మేసీ్త్రలు !


