సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు
తిమ్మాపూర్: గ్రామ పంచాయతీ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఓ టీవీ చానెల్(సాక్షి కాదు) రిపోర్టర్‌తో కలిసి ఇద్దరు తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించారు. లేకుంటే ఏసీబీకి పట్టిస్తామని కార్యాలయంలో డబ్బులు వెదజల్లి హంగామా చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని 6–96/4 నంబర్ గల ఇంటిని ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయాలని కసాడి కొమురయ్య, ఉప్పు రవీదర్, ఎడ్ల జోగిరెడ్డి తిమ్మాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ కె.నిరంజన్ పై శుక్రవారం ఒత్తిడి తెచ్చారు. కుదరదని చెప్పడంతో ముగ్గురూ కార్యాలయంలో హంగామా చేశారు. డబ్బులు వెదజల్లుతూ, ఏసీబీకి పట్టిస్తామని భయపెట్టారు. దీంతో కపాడి కొమురయ్య, ఉప్పు రవీందర్, ఎడ్ల జోగిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కె.నిరంజన్ ఎల్‌ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులకు ఫిర్యాదు


