పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని..
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పుట్టెడు దుఃఖంలో ఉన్న జర్నలిస్టులు మామిడి కుమారస్వామి, సత్యనారాయణ తన తండ్రి రాయలింగు(72) నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకున్నారు. గోదావరిఖని శాలపల్లికి చెందిన కుమారస్వామి నివాసంలో సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు ద్వారా నేత్రాలు సేకరించారు. దీనిద్వారా మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. ఇందుకు సహకరించిన మృతుడి భార్య లక్ష్మి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. ప్రతినిధులు బాబర్ సలీం పాషా, గడ్డం శ్యామ్‌కుమార్, రాజ్‌కుమార్, పందిళ్ల శ్యామ్‌సుందర్, పెద్దపల్లి సత్యం, దుబ్బల శేఖర్, సాగర్, బైరం సతీశ్, జక్కం సత్యనారాయణ, సంపత్‌కుమార్, ఎండీ రహీం, వెంగళ బాపుపద్మ, కృష్ణవేణి, భూమళ్ల చందర్, రవి పాల్గొన్నారు.
విషాదంలోనూ తండ్రి నేత్రాలు దానం
మానవత్వం చాటుకున్నన జర్నలిస్ట్‌లు
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని..


