పొలంలోనే కుప్పకూలిన రైతు
ఇల్లంతకుంట(మానకొండూర్): పొలం పనులు చేస్తూనే రైతు గుండెపోటుతో బురదలో కుప్పకూలిపోయి మృతిచెందగా, 11 ఏళ్ల కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వివరాలు.. ఇల్లంతకుంట మండలం తెనుగువారిపల్లె గ్రామానికి చెందిన రైతు దుర్మిట్ల సుధాకర్ (40) మంగళవారం ఉదయం వరినాటు వేసేందుకు బిహార్ కూలీలను పొలం వద్దకు ఆటోలో తీసుకెళ్లాడు. పొలంలో దిగి పనులు చేస్తున్న క్రమంలో సుధాకర్ బురదలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. మృతుడికి ముగ్గురు అమ్మాయిలే సంతానం. అందరూ చిన్న వయసు పిల్లలే. పెద్ద కూతురు కృతిక తండ్రి చితికి అగ్గిపెట్టడం చూసి స్థానికులు కన్నీరుపెట్టారు.
గుండెపోటుతో మృతి
తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్నారి
పొలంలోనే కుప్పకూలిన రైతు


