నవ్వుతూ జీవిద్దాం.. నవశకానికి నాంది పలుకుదాం
● దురలవాట్లకు గుడ్‌బై చెబుదాం.. నిరంతర విద్యార్థిగా మారుదాం
● సెల్ వినియోగానికి కొంత సెలవు ఇద్దాం.. సైకిల్‌పై సవారీ చేద్దాం
● గుడ్‌బై.. 2025.. వెల్‌కం– 2026
బోయినపల్లి(చొప్పదండి): కాలగమనంలో మరో సంవత్సరం కరిగి పోయింది. ఉరకలెత్తించే 2026 వచ్చేస్తోంది. గడిచిన సంవత్సరంలో ఏం చేశాము. కొత్త సంవత్సరంలో ఒత్తిడి లేని జీవన విధానాన్ని ఎలా కై వసం చేసుకుందాం అనే ఆలోచనకు రావాల్సిన అవసరం ఉంది.. కాలం మారింది.. మనమూ మారాల్సిన అవరం ఉంది.. కాలంతో పోటీ పడి పరుగులు తీసే కంప్యూటర్ యుగం.. వేళాపాల లేని ఆహారపు అలవాట్లతో గతంలో కన్నా శరీర బరువు పెరిగింది. ఎప్పటి నుంచో యోగా క్లాసులు, వాకింగ్, జిమ్‌కు వెళ్లాలనే ఆలోచన. నూతన సంవత్సరం వచ్చిన ప్రతీ సారి.. ఇక నుంచి క్రమం తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకోవడం. తర్వాత ఏవో కారణాలతో వాయిదా పడడం పరిపాటే. ఈ కొత్త సంవత్సరంలో అలా జరుగకుండా కొత్తగా ఆలోచిద్దాం. బీ పాజిటివ్.. థింక్ పాజిటివ్ పాలసీతో విజయాలు సాధించేందుకు నడుం బిగిద్దాం. ఈ విషయాన్ని గుర్తెరిగి మెదలితే మనకిక 2026లో అన్నీ విజయాలే..


