కేసీఆర్‌ను కలిసిన ‘కొండూరి’
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా కొండూరి రవీందర్‌రావు 20 ఏళ్లు సుదీర్ఘ కాలం సేవలందిస్తూ సహకార రంగాన్ని సంస్కరించారని మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో మంగళవారం రవీందర్‌రావు మర్యాద పూర్వకంగా కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, సహకార రంగంలో రవీందర్‌రావు అందించిన సుదీర్ఘ సేవలు, అమలు చేసిన సంస్కరణలు, కరీంనగర్ డీసీసీబీని ఆదర్శ సంస్థగా నిలిపిన తీరును కేసీఆర్ కొనియాడారు. సహకార రంగానికి ఆయన చేసిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు.
సెబి రీసెర్చ్ అనలిస్ట్ పరీక్షలో అర్హత
కొత్తపల్లి: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సెబి రీసెర్చ్ అనలిస్ట్ పరీక్షలో చింతకుంట శివారులోని ఎస్‌ఆర్‌ఎం పీజీ కళాశాల ఎంబీఏ హెచ్‌వోడీ ఎండీ.ఖ్వాజా మొయినొద్దీన్ అర్హత పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సి.వెంకటేశ్వర్ రావు తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ వంటి పెట్టుబడులపై విశ్లేషణ చేయడం, సలహాలు ఇచ్చే వ్యక్తిని రీసెర్చ్ అనలిస్టు అంటారన్నారు. అలాంటి సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డు ఆప్ ఇండియా) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 1,780 సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్‌లలో మొయినొద్దీన్ ఉండటం గర్వంగా ఉందన్నారు. ఎన్‌ఐఎస్‌ఎం నిర్వహించిన ఈ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన ఆయన్ను కళాశాల చైర్మన్ ఎం.తిరుపతి రెడ్డి అభినందించారు.
కేసీఆర్‌ను కలిసిన ‘కొండూరి’


