భగవద్గీత పారాయణం
కరీంనగర్‌కల్చరల్: గీతా భక్త సమాజం ఆధ్వర్యంలో వైశ్య భవన్‌లో ఆదివారం శ్రీ భగవద్గీత– లలిత సహస్రగళ స్త్రోత్ర పారాయణం వైభవంగా జరిగింది. మలయాళ సద్గురు మఠం శ్రీ గీతా మందిరం శ్రీవిష్ణు సేవానంద గిరిస్వామి, శ్రీ సంపూర్ణ నందగిరిస్వామి, ప్రముఖ జ్యోతిష్యవాస్తు ఆగమ శాస్త్ర పండితుడు నమిలకొండ రమణాచార్యస్వామి, పరబ్రహ్మానందగిరిస్వామీ, సత్యానందస్వామి, సనక సనానందస్వామి, చిదానంద గిరిస్వామి పారాయణం విశిష్టతను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవద్గీత, లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణం, భజనలు చేశారు.
భగవద్గీత పారాయణం


