కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. 1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి, 141 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అభివృద్ధి వైపు నడిపించిందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ఆరెపల్లి మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి,ఎండీ.తాజ్, పత్తి మధుకర్‌రెడ్డి, మడుపు మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, పులి ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.


