డంప్‌యార్డ్‌ను తొలగించాలి
కరీంనగర్ కార్పొరేషన్: డంప్‌యార్డ్‌ను తొలగించి, ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ బాధితకాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఉదయం ఆటోనగర్‌లోని డంప్‌యార్డ్ వద్ద పెద్దసంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డంప్‌యార్డ్ హటావో, కరీంనగర్ బచావో అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. డంప్‌యార్డ్‌కు చెత్తను తీసుకువచ్చే ఆటోలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అలకాపురికాలనీకి చెందిన దుంపేటి రాము మాట్లాడుతూ డంప్‌యార్డ్‌తో సమీపడివిజన్ల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డంప్‌యార్డ్‌లో మంటలు చెలరేగి, పొగలు వ్యాపించి శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారని ఆవేదన చెందారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.


