ఆలయంలోకి దూసుకెళ్లిన బోర్వెల్ వాహనం
సిరిసిల్ల అర్బన్: పట్టణ పరిధిలోని చంద్రంపేట చౌరస్తా వద్ద ఆదివారం ఓ బోర్వెల్ లారీ అదుపుతప్పి ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయంలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం.. వేములవాడ నుంచి వస్తున్న గణేశ్ బోర్వెల్ వాహనం చంద్రంపేట చౌరస్తా వద్ద కోనరావుపేట వైపు వెళ్లే క్రమంలో అదుపుతప్పి ఆలయంలోకి దూసుకెళ్లింది. ఆలయ గోడ కూలిపోగా.. అక్కడే కంకులు అమ్ముకుంటున్న సూర పాపయ్య ప్రాణాపాయం నుంచి తప్పించుకొని స్వల్ప గాయాలకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ కృష్ణ పరిశీలించారు. డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఆలయంలోకి దూసుకెళ్లిన బోర్వెల్ వాహనం


