భీమన్న గుడిలో భక్తుల రద్దీ
వేములవాడ: భీమన్నను ఆదివారం 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈనెల 30న ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాల అనంతరం భీమేశ్వరాలయంలో 4 నుంచి 4.30 గంటల వరకు ఆలయ శుద్ధి, 4.30 నుంచి 5 గంటల వరకు ప్రాతఃకాల పూజ, 5.45 గంటలకు పల్లకీసేవలపై ఉత్తరద్వార ప్రవేశం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
భీమన్న సేవలో భూపాలపల్లి ఎమ్మెల్యే
వేములవాడ: భీమేశ్వరస్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, కోడెమొక్కు చెల్లించుకున్నారు. ప్రొటోకాల్ ఏఈవో అశోక్‌కుమార్, పర్యవేక్షకులు రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ కుమార్, నరాల రాజు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావుకు ప్రసాదాలు అందజేస్తున్న ఏఈవో అశోక్
భీమన్న గుడిలో భక్తుల రద్దీ


