బర్కత్ లేని వానాకాలం
పడిపోయిన వడ్ల దిగుబడి ఎకరానికి ఐదారు క్వింటాళ్లు తగ్గిన పంట అంచనా 3,69,720 మెట్రిక్ టన్నులు ఇప్పటికే 2,65,620 మెట్రిక్ టన్నులు కొనుగోలు మొదట్లో కురిసిన వర్షాలే ఎఫెక్ట్
సాగైన వరి : 1,84,860 ఎకరాలు
దిగుబడి అంచనా : 3.69 లక్షల మెట్రిక్ టన్నులు
ఐకేపీ కొనుగోలు కేంద్రాలు : 159
ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలు : 72
డీసీఎంఎస్ కేంద్రాలు : 01
మెప్మా కేంద్రాలు : 07
కొనుగోలు చేసిన ధాన్యం : 2,65,620.020 మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసిన ధాన్యం విలువ: రూ.634.57 కోట్లు
చెల్లించిన డబ్బులు: రూ.610.27 కోట్లు
సిరిసిల్ల: వానాకాలం సీజన్‌లో వరికి పెద్దగా చీడపీడలు ఆశించలేవు. అలాగని చెప్పుకోతగ్గ స్థాయిలో పంట దిగుబడి కూడా రాలేదు. ఎకరానికి గరిష్టంగా 30 క్వింటాళ్ల వడ్లు రావాల్సి ఉండగా 16 నుంచి 25 క్వింటాళ్ల మేరకే దిగుబడి వచ్చింది. వ్యవసాయాన్ని ముందుచూపుతో చేసే ఆదర్శ రైతులకు సైతం 30 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈ పంట సీజన్‌లో వరికి దోమపోటు, సుడిదోమ, మెడవిరుపు వంటివి సోకలేదు. కానీ అకాల వర్షాలు.. అతి వర్షాలు.. పంట పొట్టదశలో ఉండగా కురిసిన వర్షాలతో దిగుబడి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలంలో 1,74,176 ఎకరాల్లో వరి పంట వేయగా.. ఇంతకుమించి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 1,84,860 ఎకరాల్లో వరి పంట వేసినా దిగుబడి డీలా పడ్డది. జిల్లాలో పంట దిగుబడి అంచనా 3,69,720 మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటి వరకు 2,65,620 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరో 50వేల మెట్రిక్ టన్నులను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినా.. గత ఏడాది మేరకు దిగుబడి రాలేదు. ఈసారి మెజార్టీ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆధారపడ్డారు.
సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఇలా


