కళాకారులకు పెద్దపీట వేస్తున్నారు
ప్రత్యేక స్థానం కల్పిస్తాం
వేములవాడ: శివుడికి ప్రీతిపాత్రం నృత్యం. పరమేశ్వరుడు అంతగా ఇష్టపడే నృత్యనివేదనను కళాకారులు ఇటీవల కనులపండువగా నిర్వహించారు. అక్టోబర్ 22 నుంచి ఈనెల 20 వరకు కార్తీక దీపోత్సవంతోపాటు పలువురు కళాకారులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కేంద్రం వేములవాడలో కళాకారుల ప్రదర్శనలతో మరింత ప్రత్యేకతను చాటుకుంది. భీమన్న ఆలయంలోనే నిత్యం సాయంత్రం వేళ ఈ నృత్యనివేదిక కనులపండువగా సాగింది.
పురాతన ఆలయానికి పూర్వవైభవం
గతంలో ఏనాడు లేనివిధంగా ఈయేడు కార్తీకమాసం భీమన్న ఆలయానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. ఏళ్ల నాటి భీమేశ్వరాలయానికి ప్రత్యేక కార్యక్రమాలు మరింత శోభను పెంచాయి. ఆలయంలో నెల రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో మహిళలు, పురుషుల కళాబృందాలు కలిసి ఈ నృత్యనివేదన సమర్పించారు. కళాకారులు, భక్తులతో భీమన్న ఆలయంలో సందడి నెలకొంది. శైలీ, లయ, శివతాండవ శైలిలో ప్రదర్శనలు ఇచ్చారు.
సంప్రదాయం.. భక్తిభావం
భీమన్న ఆలయంలో ఆకట్టుకున్న ప్రదర్శన
కళలను రక్షిస్తామంటున్న అధికారులు
రాజన్న ఆలయంలో భక్తితోపాటు కళాకారులకు పెద్దపీట వేసే సాంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. కార్తీకమాసం సందర్భంగా మా కళాబృందానికి కూచిపూడి నృత్య ప్రదర్శన అవకాశం కల్పించినందుకు సంతోషం.
– రమశ్రీ, కళాకారిణి
రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాలతో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఇందులో భాగంగా కళాకారుల నృత్యనివేదన ఆకట్టుకుంది. భక్తి, సాంస్కృతిక వైభవాన్ని ఒక్క చోట చూపించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. భక్తులు, స్థానికులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. – రమాదేవి, ఆలయ ఈవో
కళాకారుల నృత్యనివేదన
కళాకారుల నృత్యనివేదన
కళాకారుల నృత్యనివేదన


