జేఎన్టీయూ ప్రొఫెసర్.. యంగ్ అచీవర్
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ మంథని జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌ఆర్ కృష్ణ యంగ్ అచీవర్ అవార్డు అందుకున్నారు. జేఎన్టీయూ యూనివర్సిటీ స్థాపించి 60ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన డైమండ్ జూబ్లీ వేడుకల్లో 19మంది పూర్వ విద్యార్థులకు యంగ్ అచీవర్ అవార్డు ప్రదానం చేశారు. ఇందులో కొండగట్టు జేఎన్టీయూ పూర్వ విద్యార్థి, ప్రస్థుత మంథని అసిస్టెంట్ ప్రొఫెసర్, త్రీడీ ఆర్టిస్ట్ కృష్ణ ఉన్నారు. డిప్యూటీ సీఎం విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి తదితరులు కృష్ణ రూపొందించిన త్రీడీ చిత్రాలు తిలకించి అభినందించారు. అదేవిధంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, మంథని ప్రాంతానికి చెందిన ఆర్టిస్ట్ ఉన్నతస్థానం చేరుకోవడం గర్వకారణామన్నారు. భవిష్యత్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.
అభినందించిన డిప్యూటీ సీఎం, మంత్రి


