ఫోరెన్సిక్ నివేదికే కీలకం
ఓదెల(పెద్దపల్లి)/జమ్మికుంట: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరుపై పేల్చివేసిన చెక్‌డ్యాం గుట్టురట్టుకు ఫోరెన్సీక్ నివేదికే కీలకమని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంను కలెక్టర్, సీపీ సోమవారం పరిశీలించారు. చెక్‌డ్యాంను నాణ్యత లోపమా, పేల్చివేశారా? అనేది త్వరలో తేలుస్తామని అన్నారు. నాణ్యత లోపంతో కూలితే సంబంధిత శాఖ అధికారులపై చర్చ తీసుకుంటామన్నారు. పేల్చివేస్తే దుండగులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వివరించారు. చెక్‌డ్యాం ఎంతదూరం ధ్వంసమైంది, దాని సామర్థ్యం ఎంత అనే అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్, జమ్మికుంట సీఐలు సుబ్బారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దర్యాప్తు వేగవంతం
పెద్దపల్లి జిల్లా గుంపుల, కరీంనగర్ జిల్లా శంభునిపల్లి మధ్య మానేరులో చెక్‌డ్యాం పేల్చివేత ఘటనపై విచారణ వేగవంతంగా సాగుతోందని హుజూరా బాద్ ఏసీసీ మాధవి, టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. పేల్చివేతతో రూ.3కోట్ల వరకు ఆస్తినష్టం వా టిల్లిందని కాల్వశ్రీరాంపూర్‌లోని ఇరిగేషన్ డీఈఈ రవి ఫిర్యాదు చేశారని, వాగులో పెద్దశబ్దాలు వచ్చా యని రైతులు చెబుతున్నారని, ఈ కోణంలోనూ విచారణ చేపట్టామని అన్నారు. ఎస్‌ఎఫ్‌ఎల్ డైరెక్టర్ వెంకటరాజం బృందం ఘటనా స్థలాన్ని పరిశీలిందన్నారు. చెక్ డ్యామ్ 737 మీటర్లు పొడవు ఉంగా, 7, 8, 9 బ్లాక్‌ఽలు ధ్వంసమయ్యాయని వివరించారు. అయితే, నిర్మాణంలో లోపమా? ఇసుక అక్రమ రవాణాదారులు పనేనా? అనే అంశలోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సివిల్ ఇంజిర్లు విచారణలో పాల్గొనేలా చూస్తామని అన్నారు. ఎస్సై సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
ఫోరెన్సిక్ నివేదికే కీలకం


