
వినూత్నం.. విజ్ఞానం
–మరిన్ని కథనాలు 8లోu
సిరిసిల్ల ఎడ్యుకేషన్: పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడం పరిపాటి. కానీ మిషన్–100 లక్ష్యంగా విద్యార్థులతో నూతన ఆవిష్కరణలు చేయిస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు తాడూరి సంపత్‌కుమార్. తన ఉద్యోగ విరమణలోపు కనీసం 100మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆవిష్కరణకర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మిషన్–100 కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 61మంది వివిధ ఆవిష్కరణలు ప్రదర్శించగా.. వీరిలో 8మంది అంతర్జాతీయస్థాయి, 16మంది జాతీయస్థాయి, 30మందికి పైగా రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకున్నారు. 2021, 2023లో ఇద్దరు విద్యార్థుల ఆవిష్కరణలు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. బోచ్, ఎన్‌ఐఎఫ్, టీజీఐసీ సంస్థలు పిల్లల ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందేందుకు సహకారం అందిస్తున్నాయి. సంపత్ కుమార్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించింది.
● నూతనంగా ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు ● విభిన్న బోధనలతో ఆకట్టుకుంటున్న వైనం
● ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉత్తమ అవార్డులకు పలువురి ఎంపిక ● నేడు టీచర్స్ డే
అమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని సక్రమ దారిలో నిలబెట్టే ఏకై క వ్యక్తి గురువు. బుడిబుడి అడుగులు వేస్తూ ఓనమాలు దిద్దే వయసు నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడే వరకు మార్గదర్శిగా నిలుస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల, కళాశాల, యూనివర్సిటీల్లోని గురువురు వినూత్నంగా విద్యాబోధన అందిస్తున్నారు. పుస్తకాల్లోని పాఠాలను అర్థమయ్యే రీతిలో ప్రత్యక్షంగా వివరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రపంచీకరణ వేగాన్ని అందుకునే విధంగా సలహాలు.. సూచనలు ఇస్తూ.. విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల ప్రయోగాలు చేయిస్తూ.. జాతీయస్థాయిలో పేరుపొందేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు ఉత్తమ గురువులుగా ప్రశంసలు పొందుతున్నారు. నేడు దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు..
కాల్వశ్రీరాంపూర్: విద్యార్థుల్లో ఒకరిగా ఫ్రెండ్లీ బోధనతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఉపాధ్యాయురాలు కోయాల్కర్ స్వప్న. 13 ఏళ్లుగా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నా రు. ప్రస్తుతం కాల్వశ్రీరాంపూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా కొనసాగుతున్నారు. 2008లో శంకరపట్నం మండలం రాజాపూర్‌లో విధులు ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో పనిచేశారు. ఉత్తమ విద్యాబోధన, విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఆటపాటలతోపాటు కృత్యాధారణ బోధన (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) చేస్తూనే మండలస్థాయిలో నిర్వహించే ఎఫ్‌ఎల్‌ఎన్‌లో రిసోర్స్ పర్సన్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు. కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీకి గతేడాది బదిలీపై వచ్చిన స్వప్న 50మంది నుంచి 60మందికి విద్యార్థుల సంఖ్యను పెంచారు.

వినూత్నం.. విజ్ఞానం

వినూత్నం.. విజ్ఞానం