
భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర
● కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
గణేశ్ నిమజ్జనోత్సవా న్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కేంద్ర హో ంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ సూచించారు. శుక్రవారం ఉదయం నుంచే విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మానకొండూర్ చెరువు, చింతకుంటలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన పాయింట్లను గురువారం పరిశీలించారు. కరీంనగర్‌లో పదేళ్లుగా ప్రశాంతంగా గణేశ్ నిమజ్జోత్సవం జరుపుకుంటున్నామని, ఈసారి అదే తరహాను అవలంబించాలని తెలిపారు. మంత్రి వెంట ఆర్డీవో కుందారపు మహేశ్వర్, మున్సిపల్ ఎస్‌ఈ రాజ్‌కుమార్, మాజీ మేయర్ సునీల్ రావు, గుగ్గిలపు రమేశ్ పాల్గొన్నారు.