
హిందూ పండుగలపై వివక్ష ఎందుకు?
హిందువుల పండుగలంటే మొదటి నుంచి కాంగ్రెస్‌కు వివక్షేనని, గణేశ్ నిమజ్జనోత్సవానికి కరీంనగర్‌లో ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తను వస్తే ఒక్క అధికారి కూడా నిమజ్జన కేంద్రం వద్ద ఉండరా అంటూ మండిపడ్డారు. చింతకుంటలోని వినాయక నిమజ్జనం కేంద్రం ఎస్సారెస్పీ కెనాల్‌ను గురువారం పరిశీలించారు. నిమజ్జనం శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమవుతున్న వేళ ఒక్కక్రేన్ లేదు..లైట్లు లేవు..ఒక్క అధికారి లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నాయకులు పిల్లి మహేశ్‌గౌడ్, భూక్య తిరుపతినాయక్, కాసారపు శ్రీనివాస్‌గౌడ్, నరేందర్ పాల్గొన్నారు.