
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా శ్రీవాణి
కరీంనగర్‌క్రైం: శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ కొడూరు శ్రీవాణి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. టీచర్స్ డే సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోనున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు గ్రామానికి చెందిన శ్రీవాణి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఎకనామిక్స్ ఆండ్ స్టాటిస్టిక్స్, అసిస్టెంట్ స్టాటిటికల్ ఆఫీసర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఇలా.. ఆరు ఉద్యోగాలు ఏకకాలంలో సాధించారు. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో అర్థశాస్త్ర విభాగం అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా, బాలికల వసతి గృహం చీఫ్ వార్డెన్‌గా పనిచేశారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్ అడిషనల్ కంట్రోలర్‌గా ఉంటూ.. ఈ ఏడాదికి ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యారు. వీసీ ఉమేశ్‌కుమార్ అభినందించారు.