
ఎస్సారార్ నుంచి అర్జున్
కరీంనగర్‌క్రైం: నగరంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కే.అర్జున్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లికి చెందిన కే.అర్జున్ 2013, జనవరి 1న అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా నియామకం అయ్యాడు. 12ఏళ్లుగా కామర్స్ సబ్జెక్టు బోధిస్తూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనన పత్రాలు ప్రచురించారు. ప్రస్తుతం ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం, జిల్లా నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అర్జున్‌ను ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ, కడారు సురేందర్‌రెడ్డి, నితిన్‌పాఠక్, టి.రాజయ్య అభినందించారు.