
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
కరీంనగర్‌క్రైం/హుజూరాబాద్/జమ్మికుంట: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామ ని సీపీ గౌస్‌ఆలం పేర్కొన్నారు. చొప్పదండి ఎస్సారెస్పీ కా లువ, బొమ్మకల్ చెరువు, హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శివారులో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్, జమ్మికుంటలోని నాయిని చెరువు వద్ద నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాలలో గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, లైఫ్‌బోయ్స్‌తో పాటు మొబైల్ బైక్‌లను ఫైర్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఏసీపీలు విజయ్‌కుమార్, శ్రీనివాస్‌జి, సీఐలు ప్రదీప్‌కుమార్, నిరంజన్‌రెడ్డి, వెంకట్, రామకృష్ణ, ఎస్సైలు ఉన్నారు.