
ఎమ్మెల్యే సోదరుడి మృతి
● బండి సంజయ్ సహా పలువురి సంతాపం
కరీంనగర్ కార్పొరేషన్: డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో నగరంలోని ఆయన నివాసంలో బుధవారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మో హన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి త దితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో సత్యనారాయణను పరామర్శించారు.
కలెక్టర్ పరామర్శ
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పరామర్శించారు.
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కందునూరిపల్లి గ్రామానికి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ కందునూరి తిరుపతి(39) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. తన నానమ్మ పేరిట ఉన్న భూమిని పట్టాచేయడం లేదని, సొంతింట్లో ఉండడం లేదని, తన ఇద్దరు కుమారులకు ఏమీ చేయడం లేదని తిరుపతి కొంతకాలంగా మానసికంగా వేదనలో ఉన్నాడు. పాతఇంట్లో పడుకుంటాని భార్యకు చెప్పి మంగళవారం రాత్రి వెళ్లాడు. మరునాడు ఉదయం భర్తను నిద్రలేపడానికి వె ళ్లగా ఎంతకీలేవలేదు. కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. ఈమేరకు భార్య సరిత ఫిర్యాదు చేసిందని ఎస్సై వివరించారు.
కరీంనగర్‌క్రైం: అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ సీఐ రాంచందర్‌రావు వివరాల ప్రకా రం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట సెంగెం గ్రామానికి చెందిన అబ్రమ్ జ్ఞానేశ్వర్‌కు, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్ గ్రామానికి చెందిన భావన అలియాస్ మానసకు 2023 నవంబర్‌లో వివాహం జరిగింది. అప్పుడు 16 తులాల బంగారం, రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వీరికి ఆరు నెలల కూతురు ఉంది. జ్ఞానేశ్వర్ కరీంనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ.. భగత్‌నగర్‌లో భార్య, కూతురుతో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం కావాలంటూ జ్ఞానేశ్వర్, అతని తల్లిదండ్రులు సంగమణి, అంజయ్య, చిన్న ఆడపడుచు శ్యామల వేధిస్తున్నారని మానస తన తండ్రి క్యాస కిష్టయ్యకు చెప్పుకుంటూ బాధపడేది. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని మృతిచెందింది. తన కూతురు మృతికి భర్త జ్ఞానేశ్వర్, అతని తల్లిదండ్రులు, చిన్న ఆడపడుచు కారణమంటూ కిష్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ మూలమలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా పాల్వంచమర్రికి చెందిన కడమంచి వెంకటి మృతిచెందాడు. వెంకటి బైక్‌పై సముద్రలింగాపూర్ వెళ్లి వస్తుండగా పెద్దమ్మ స్టేజీ మూలమలుపు వద్ద కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటిని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య లీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.

ఎమ్మెల్యే సోదరుడి మృతి

ఎమ్మెల్యే సోదరుడి మృతి

ఎమ్మెల్యే సోదరుడి మృతి