
వాటర్ ట్యాంక్ క్లోరినేషన్
వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జాండీస్ తో గ్రామస్తులు బాధపడుతున్న తీరుపై ‘సాక్షి’లో ఈ నెల 17న ‘బేతిగల్‌కు జాండీస్’ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. వరంగల్ రీజియన్ బాక్టీర్యాలోజిస్ట్ హెల్త్ ల్యాబరేటరీ అధికారి కృష్ణారావు సోమవారం గ్రామంలో పర్యటించి, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నీటిని పరిశీలించారు. క్లోరినేషన్ చేయడంలేదని సిబ్బదిని మందలించారు. దీంతో బుధవారం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, జీపీ వాటర్ ప్లాంట్‌ను సిబ్బంది శుభ్రం చేశారు. ఆనంతరం క్లోరినేషన్ చేసి గ్రామంలోకి నీటిని వదిలారు.
వేములవాడ: రాజన్నకు 34 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,97,54,588 నగదు, బంగారం 170 గ్రాములు, వెండి 10.300 కిలోలు వచ్చినట్లు ఈవో రాధాభాయి తెలిపారు. ఓపెన్‌స్లాబ్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు నిర్వహించారు.
తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ సమీపంలో రెండు రోజుల క్రితం బస్సు, కారు ఢీకొన్న విషయం తెల్సిందే. సదరు కారు టైర్లను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రమాద స్థలంలో వాహనాలను పర్యవేక్షించే విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేయడంతో ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదస్థలంలో వాహనాలను సురక్షితంగా ఉంచడం, రాత్రిపూట పెట్రోలింగ్‌ను పెంచడం వంటి చర్యలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి దొంగలను పట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): గణేశ్ పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి సూచించారు. ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ లైన్ల ఎత్తు పెంచాలని తెలిపారు. ఈ మేరకు బుధవారం హన్మకొండ విద్యుత్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యుత్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు, భక్తులు, మండప నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. స్తంభాలపైన ఉన్న టీవీ కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు తొలగించాలని అన్నారు. విగ్రహాల ఎత్తుని బట్టి రూట్‌ని నిర్ణయించుకోవాలని, ఒక వేళా ఎక్కడైనా సమస్యలు ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు.

వాటర్ ట్యాంక్ క్లోరినేషన్

వాటర్ ట్యాంక్ క్లోరినేషన్